పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 3 బోధన్ : హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం బోధన్ పట్టణంలోని సాయిబాబా మందిరం వద్ద ప్రారంభమైన హిందూ మహిళల స్కూటీ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా కొత్త బస్టాండ్ శక్కర్ నగర్ చౌరస్తా మీదుగా కొనసాగి పట్టణంలోని మారుతి మందిర్ కు చేరుకుంది అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కాషాయం దుస్తులు ధరించి పట్టణంలో హిందూ మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో సందడి నెలకొంది. మహిళలు స్కూటీలపై ర్యాలీ చేస్తూ జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు హిందూ మహిళలు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించడం పట్ల పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భం చూస్తుంటే హిందువులు ఏకమవుతున్నట్లు కళ్లకు కట్టుతుందని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.