భవన కార్మికులకు సంక్షేమ పథకాలు పునరుద్ధరణ

పయనించే సూర్యుడు 3.4.2026 చోడవరం సహాయ కార్మికధికారి పరిధిలో గల సబ్బవరం, దేవరాపల్లి, కె.కొటపాడు, చీడికాడ,బుచయ్య పేట,రావికమతం, మాడుగుల మండలాల్లో గల భవన నిర్మాణ కార్మికులందరకు గత నెల నుండి సంక్షేమ పథకాలు పునరిద్దరించ బడ్డాయిని సహాయ కార్మికధికారి పి. సూర్యనారాయణ తెలియజేశారు. బుధవారం చోడవరం శివాలయo ప్రాంగణంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు కుమార్తె వివాహానికి రూ.40,000, ప్రసూతి కి 20,000, సహజ మరణం కి 60,000/- దహన ఖర్చుల క్రింద 20,000/- అందజేయడం జరుగుతదన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించు కోవాలిసినదిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ, శ్రీ బాల గణపతి తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షులు కార్యదర్శి లు కోన నూకరాజు, నారం మధు ప్రసాద్, శ్రీ సీతారాం తాపీ సంఘం అధ్యక్షులు కార్యదర్శి లు నిట్టా నూకరాజు, మజ్జి రమణ బాబు, అనుబోతు జల ఈశ్వరరావు, దేవుడు బాబు, నొడా అప్పారావు తదితరులు పాల్గొన్నారు