పయనించే సూర్యుడు, ఏప్రిల్ 2, బచ్చన్నపేట మండలం ప్రతినిధి: నీల పవన్. ప్రజా పాలనలో భాగంగా గురువారం రోజు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభ విజయవంతంగా జరిగింది. ఆయా గ్రామాల సర్పంచులు సెక్రటరీలు వార్డ్ నెంబర్లు, గ్రామ ప్రజలు గ్రామ సభలో పాల్గొని గ్రామానికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కార మార్గాలను చర్చించారు. బచ్చన్నపేట కొడవటూరు గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో ఆ గ్రామ సర్పంచులు అల్వాల నర్సింగరావు నీల కవిత మురళీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాలను అందేలా కృషి చేస్తామని తెలియజేశారు.