మంత్రాలయం నియోజకవర్గంలో రూ.66 కోట్ల రహదారి పనులకు భూమిపూజ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 03 రిపోర్టర్ అభి మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి కీలక ముందడుగుగా రూ.66.02 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు-మాలపల్లి బీటీ రోడ్‌కు రూ.4.80 కోట్లు, జలవాడి-కమ్మలదిన్నె సీసీ రోడ్‌కు రూ.2.40 కోట్లు, బైపాస్ చెట్నీపల్లి-కల్లూదేవకుంట రహదారికి రూ.59 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, మెరుగైన రవాణా సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *