మాడగడ పంచాయతీలో అభినందన సన్మాన సభఆత్మీయ సత్కారం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 3 రూలర్ ప్రతినిధి బి బాసు అల్లూరి సీతరామరాజు జిల్లా, అరకు లోయ మండలంలో పరిధిలో గల మాడగడ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు గురువారం పంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పదవీకాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అభినందన సన్మాన సభ- ఆత్మీయ సత్కారం నిర్వహించారు.
మాడగడ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులకు సచివాలయం సిబ్బంది సభ్యులు బొకేలు అందజేసి, దుస్సాల కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గత కాలంలో పంచాయతీ అభివృద్ధికి పాలకవర్గం చేసిన సేవలను కొనియాడారు. సర్పంచ్ మరియు వార్డు సభ్యులు తమకు అందించిన గౌరవానికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు.ప్రజలకు మంచి సేవలు అందించాలని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కోరారు,ఈ కార్యక్రమం క్రమంలో పాలకవర్గ సభ్యులు, ఉప్పు సర్పంచ్ కిల్లో గాసి, వార్డ్ మెంబర్ పేర్లు వంతల డేవిడ్, మహాదేవ్, లక్ష్మణరావు, ఇందుమతి, దేవుడమ్మ, సచివాలయం సిబ్బంది తాతబాబు ఆర్టికల్చర్, మల్లీశ్వరి వెల్ఫేర్, విజయశాంతి పంచాయతీ మహిళా పోలీస్, కుమార్ రాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, రామ్ లాల్ వెటర్నరీ, రాంబాబు డిజిటల్ అసిస్టెంట్, చైతన్య సర్వేయర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *