
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మానవతా వాదులు గా సమాజ సేవ చేద్దాం ఆపదలో ఉన్న వారిని రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాలన్నదే నా అభిమతం ఆత్మకూరులో లివర్ వ్యాధులు, లివర్ మార్పిడిపై అవగాహన సదస్సును ప్రారంభించిన మంత్రి ఆనం పేదలకు వైద్యసేవలు అందించేందుకు సేవాభావంతో ముందుకొచ్చిన ప్రముఖ వైద్యులు రజనీకాంత్‌ను అభినందించిన మంత్రి ఆనం మంత్రి ఆనం కామెంట్స్ ఒక మంచి పనిచేసేందుకు రాజకీయాలు అవసరం లేదు.మానవత్వం ఉంటే చాలు ఒక మనిషికి ఆత్మస్థయిర్యం కల్పించే కార్యక్రమం చేపడితే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇటీవల ఓ 17ఏళ్ల కుర్రాడికి కాలు లేక బాధపడుతుంటే కృత్రిమంగా కాలు ఏర్పాటు చేసి ఆ బాలుడు నడుస్తుంటే చెప్పలేని సంతృప్తి కలిగింది. ఈ అబ్బాయి తల్లిదండ్రులు మన పార్టీ కాదు.మనకు ఓటెయ్యలేదు. అయినా మంచి చేసే సమయంలో మానవత్వంతో ముందుండాలి. ప్రతిదీ రాజకీయంకాదు.మానవత్వంతో ముందుకెళ్లి సేవ చేయడం అలవాటు చేసుకోవాలి ఆత్మకూరులో పేదల కోసం జిల్లాస్థాయి వైద్యశాలను తీసుకొచ్చాం.విడతలవారీగా పడకలను పెంచుకుంటూ వైద్యసేవలనువిస్తరించాం. ఆసుపత్రిలో అత్యున్నతస్థాయి వైద్యసేవలందించే విధంగా భవనాలు, మెడికల్ ఎక్విప్‌మెంట్సు సమకూరుస్తున్నాం. ప్రతిఒక్కరూ కూడా సమాజంలో పేదలకు ఎంతోకొంత సేవ చేయాలనే భావన కలిగి ఉండాలి.అదే మంచి చేసేందుకు ముందుకు నడిపిస్తుంది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు