పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 (వట్టిపల్లి ప్రతినిధి హనీఫ్) సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం మర్వెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆహార పదార్థాలు స్వచ్ఛందంగా వండుకొని తింటే ఎలా ఉంటాయి హోటల్లో ఆర్డర్ చేసి తింటే ఎలా ఉంటాయి విద్యార్థులు ఎంతో చక్కగా వివరించారు మనం స్వచ్ఛందంగా వండుకొని తింటే అందులో ఉన్న ఉపయోగాల గురించి దానివల్ల వచ్చే ఆరోగ్యానికి వచ్చే ఉపయోగాల గురించి ఎంతో చక్కగా వివరించారు చిన్నారి విద్యార్థులు అందరూ తరగతుల వారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తయారు చేసుకొని రావడం జరిగింది. వర్షా ఐదవ తరగతి క్లాస్ బెల్లం నువ్వుల లడ్డు. జ్యోతిక బెల్లం గులాబ్ జామ్. మనిషా సేమియా, భానుప్రియ డబుల్ కా మీఠా, స్పందన పకోడీ, విశ్వేశ్వరి పల్లీలు నువ్వుల చక్కిలు, శ్రీరామ్ సత్తుపిండి లడ్డూలు, రక్షణ పునుగులు, విశ్వతేజ మామిడి పులిహోర, మునగాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా తో పచ్చడి తయారు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మేడంగారు కొబ్బరి పోలెలు పులిహోర, విద్యార్థులందరికీ జిలేబి ఇవ్వడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు రితిన్ రెడ్డి విద్యార్థులందరికీ ఫ్రూట్ సలాడ్ అందివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని తిలకించడానికి జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలు సాయి లీల . రుచి చూసి విద్యార్థులను అభినందించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు టి. రవీందర్, సిహెచ్. సంగమేశ్వర్, టీ. నర్సింలు, సీఆర్పీలు సంగమేశ్వర్, గోపి సింగ్ పాల్గొనడం జరిగింది.
