మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ నూతన కార్యవర్గం ఖరారు

★ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాకాల రాజ్ కుమార్ నియామకం

పయనించే సూర్యడు /ఏప్రిల్ 3/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సంప్రదింపుల మేరకు వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్, ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యుల నియామక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పాకాల రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల పార్టీ శ్రేణులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సేవలో చురుగ్గా ఉంటూ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించిందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ కు ఆయన శ్రేయోభిలాషులు మరియు కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.