పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ ఆదేశాల మేరకు సంస్థ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా టిడిపి పొలిటికల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదోని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వేశారు. జీవన జ్యోతి అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు అందజేశారు. టిడి జనార్దన్ ఆయురారోగ్యాలతో జీవించాలని , రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో నాయకులు షకీల్, సద్దాం హుసేన్,రెహమానియా మసీదు కమిటీ సభ్యులు అబ్దుల్ సుభాన్, ఇమ్రాన్, ఇలియాస్, తన్వీర్, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
