పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-03 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సెంటనరీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి రామగిరి మాజీ ఎంపిపి ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ హాజరై ఆయన ఫోటోకి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి గోల్కొండ కోటను వశపరుచుకున్న పోరాటయోదుడు తెలంగాణలో పుట్టడం, అందునా గౌడకులంలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తితో బహుజనులందరం రాజ్యాధికారం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు