రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బకాయి డబ్బులు 51 వేల కోట్లు వెంటనే చెల్లించాలి

* సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటనరీ కాలనీ -03 రామగుండం 3 ఏరియాలోని ఓసి 2 లో పిట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిఐటియు గేట్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మికుల సమస్యలని గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ పరిస్థితిని దిగ జారుస్తుందని,సింగరేణి ఖజానా ని ఖాళీ చేస్తూ క్లిష్ట పరిస్థితికి సింగరేణి ని చేరుస్తున్నారని, మెడికల్ బోర్డు ని జరుపకుండా ఆపటమే గాక, పాత మెడికల్ బోర్డుల మీద విజిలెన్స్ జరుపుతామనటం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్ లను కార్మిక లోకం అంతా వ్యతిరేకిస్తున్నా దాని మీద నోరు మెదపక పోవడం, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బకాయిలు చెల్లించకపోగా, ఇష్టా రాజ్యాంగా సింగరేణి నిధులు వాడుకుంటూ సింగరేణి కార్మికులని మోసం చేస్తున్నారని, సింగరేణి కార్మికులు అంతా గమనిస్తున్నారని, ప్రభుత్వ వైఖరి మారకపోతే తగిన పరిణామాలు చూస్తారని హెచ్చరించారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సమస్యలు గాలికొదిలేసి సోధ్యం చూస్తూ గుర్తింపు సంఘం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ జి త్రీ కార్యదర్శి దొమ్మటి కొమురయ్య ఇతర నాయకులు ఎద్దు కుమార్, ఆసరి మహేష్, వేణుగోపాల్, రమణారెడ్డి, రాయమల్లు, మల్లికార్జున్, మీనయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *