సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ప్రజల కోసం పోరాడిన గొప్పస్ఫూర్తి అని: టీపీసీసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, జగదీశ్వర్ గౌడ్ ..

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 03 రంగారెడ్డి ప్రతినిధి (ఎస్ఎంకుమార్) తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యా ధికార పోరాట యోధుడు,మొగులాయి దౌర్జన్యాలను ఎదిరించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సంద ర్భంగా మియాపూర్ డివిజన్ పరిధి లోని ఆల్విన్ చౌరస్తా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్ని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా నికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయ కులతో కలిసి పూలమాలలు వేసి ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది:“పదవి కోసం కాదు… ప్రజల కోసం పోరాడాలి!” మనం అందరం సంకల్పం చేద్దాం ప్రజల అభివృద్ధి కోసం,సమానత్వం కోసం,న్యాయం కోసం నిరంతరం కృషి చేద్దాం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి, అన్యాయానికి ఎదురు నిలబడి రాజ్యాన్ని నిర్మించడం అంటే అది సాధా రణ విషయం కాదు. అది ధైర్యం, ఆత్మవి శ్వాసం,ప్రజల పట్ల ఉన్న అంకితభావా నికి ప్రతీక శ్రీ పాపన్న గౌడ్ అదే చేసి చూపించారని, ఆయన పోరాటం కేవలం అధికారానికి కాదు అది సమానత్వాని కి, న్యాయానికి, స్వాభిమానానికి చేసిన పోరాటం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు రమణ మూర్తి,యా దగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, కావూరి ప్రసాద్, బలింగ్ గౌతమ్ గౌడ్, మన్నేపల్లి సాంబశివ రావు, ఏకాంత్గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, యాదగిరి గౌడ్, సురేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్ ,వినయ్ కుమార్ పుట్టా ,శ్రీనివాస్ గౌడ్, రవి కుమార్ గౌడ్, తాండ్ర రాంచందర్, రాములు గౌడ్, నర్సింహ గౌడ్, యాదయ్య గౌడ్, పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *