సాలూర తహసిల్దార్ గా ఎంఏ నవాజ్ బాధ్యతలు.

★ బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్.

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 సాలూర : సాలూర మండల తహసిల్దార్ గా ఎంఏ నవాజ్ గురువారం బాధ్యతలు చేపట్టారు.ఇంచార్జ్ తహసిల్దార్ గా సురేందర్ నాయక్ నిన్నటి వరకు విధులు నిర్వహించారు.ఇవాళ బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై డిప్యూటీ తాహసిల్దార్ గా విధులు నిర్వహించారు.పదోన్నతి పై సాలూరకు తహసిల్దార్ గా వచ్చారు.ప్రజా ప్రతినిధులు,ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు.