పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 దండేపల్లి హనుమాన్ జయంతి సందర్భంగా దండేపల్లి మండలం లోని కొత్త మామిడిపల్లి గ్రామం లో జయంతి వేడుకలు ఘనంగా జరిపినారు.మాజీ జెడ్పీటీసీ సభ్యులు గడ్డం నాగరాణి త్రిమూర్తి దంపతులు స్వామి వారికి 108 రకాల నైవేద్యాలు సమర్పించారు.ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన మరియు హనుమాన్ దీక్ష స్వాములు హనుమాన్ చాలీసా పారాయణము చేసినారు. బజన, సాంస్కృతిక, కార్యక్రమాలతో పాటు మహిళ స్వాములు కోలాట ఆటలు చిన్నారుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు.గ్రామ నాయకులు,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.