పయనించే సూర్యుడు, ఏప్రిల్ 3, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్, అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, అజేయమైన ధైర్యానికి ప్రతీకగా ప్రతి హృదయంలో వెలుగొందే భగవాన్ శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలోని శివాలయం వద్ద నుండి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ప్రతి ఒక్కరూ హనుమంతుడిలా ధైర్యసాహసాలతో, నిస్వార్థ సేవాభావంతో, అపార సహనంతో జీవించాలని, మనిషిలోని భయాలను జయించి, సత్యం, ధర్మమార్గంలో ముందుకు సాగేందుకు హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,పట్టణ కౌన్సిలర్లు హన్మంతు సాయి చంద్ర, కన్యశ్రీ సేవ్య నాయక్,అడ్వకేట్ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.