హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు

పయనించే సూర్యుడు,కోరుట్ల ఏప్రిల్ 3 ( చింతోజి రాధాకృష్ణ ) హనుమాన్ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలో భక్తి భావం వెల్లివిరిసింది.ఈ సందర్భంగా మహాదేవ్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడగా, అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొని భక్తులతో కలిసి సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని మెయిన్ రోడ్డులో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్ పాల్గొని వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని పూజల్లో పాల్గొన్నారు.