పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బొడ్రాయి (గ్రామదేవత) మరియు భూలక్ష్మి- మహా లక్ష్మి విగ్రహ ప్రతిష్టోత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిత్య హోమం నిర్వహించారు. అనంతరం నూతన విగ్రహాలను ప్రతిష్టించారు.ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని, గ్రామ దేవతలను భక్తితో కొలుస్తున్నారు.