అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన బిఆర్ఎస్ యువనేత అభిమన్యు రెడ్డి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 4, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళా శేఖర్: రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ నషీర్ (43) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం పట్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నషీర్ మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అభిమన్యు రెడ్డి, ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని నిర్ణయించారు. తన యువసేన సభ్యుల ద్వారా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 5,000/- ఆర్థిక సాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , బిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి సంతోష్ వెంకటేష్, డిప్యూటీ సర్పంచ్ మంత్రి రామచందర్, బిఎస్పీ మండల అధ్యక్షులు కాకతల యాదగిరి తో పాటు వార్డ్ సభ్యులు గుడ్ల శ్రీశైలం, యువసేన నాయకులు ఎన్నం కుమార్ గుప్తా, మాజీ సర్పంచ్ కుమారుడు పి. వెంకట్రాములు, మాజీ వార్డ్ మెంబర్ వెంకట్ రెడ్డి, నాయకులు కిషోర్ రెడ్డి, లింగారెడ్డి, అనిల్ కుమార్, నర్సింగరావు, హస్నాద్దీన్, తుప్పడు మల్లయ్య, సురేందర్ రెడ్డి, పెరుమాళ్ళ నరసింహ, అజహర్, జహంగీర్, రషీద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *