పయనించే సూర్యుడు-04-04-2026-రాజంపేట న్యూస్ : తాళ్లపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్నమాచార్య యూనివర్సిటీ భారీ స్థాయిలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరువు భూమిలో అక్రమంగా భవనాలు నిర్మించడమే కాకుండా గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులను కూడా ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాలను ఒంటిమిట్ట పర్యటనలో సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. చెరువులను ఆక్రమించడం ద్వారా పర్యావరణానికి నష్టం కలిగించడమే కాకుండా పన్నులు ఎగవేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని దోచుకోవడం అత్యంత తీవ్రమైన ప్రజా ద్రోహమని, ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం ఉదాహరణగా నిలిచేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.