ఆదోని టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

చెక్కులను పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని పట్టణంలో, ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, ఆదోని టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మొత్తం 45 మంది బాధితులకు కలిపి రూ.18,14,655 ( 18 లక్షలు 14 వేల 655 రూపాయలు) విలువైన చెక్కులను టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు మరియు ఇతర సంక్షేమ కారణాల నిమిత్తం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఇది నిదర్శనమని అన్నారుమన ఆదోని నియోజవర్గం నుండి మన పెద్దాయన మీనాక్షి నాయుడు సహకారంతో 564 మందికి కాను 2,0378,413 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. ఇక 289 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇక వచ్చేవి ఉన్నాయని తెలిపారూ భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగస్వామి నాయుడు, మండల అధ్యక్షుడు శివప్ప, కర్నూల్ పార్లమెంట్ టిడిపి వైస్ ప్రెసిడెంట్ రంగన్న, 1 వార్డ్ మాజీ కౌన్సిలర్ వెంకటేష్, ఎక్స్ కౌన్సిలర్ అంజి, జయరాం, గిడ్డయ్య, శ్రీరాములు, దిబ్బనకల్ లక్ష్మన్న, విరుపాపురం వీరేష్, వలమన్న, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు,.