పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బొడ్రాయి (గ్రామదేవత) మరియు భూలక్ష్మి- మహా లక్ష్మి విగ్రహ ప్రతిష్టోత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిత్య హోమం నిర్వహించారు. అనంతరం నూతన విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని గ్రామ దేవతలను కోరుకుంటున్నాను అని అన్నారు. గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటెల లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, 6 వ వార్డు సభ్యులు సారబుడ్లలింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జల మల్లారెడ్డి, సంగాల మహేష్, మారుపాక వినయ్ తదితరులు పాల్గొన్నారు.