పాయనించే సూర్యుడు చోడవరం 4.3.2026 అనకాపల్లి జిల్లా చోడవరం లో కోటవీధి ఉన్న క్రీస్తు ప్రార్ధన మందిరం లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘవిశ్వాసులందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువు సిలువ లో పలికిన ఏడు మాటలు గూర్చి పాస్టర్ రెవ|| డా|| పి కిషోర్ కుమార్ తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు మానవాళికి క్షమాపణ, రక్షణ మరియు దేవుని ప్రేమను తెలియజేస్తాయి. ఈ మాటలు క్షమాపణ, రక్షణ, సంబంధం, పరిత్యాగం, దుఃఖం, విజయం మరియు సమర్పణకు సంకేతంగా నిలుస్తాయి. సిలువలో పలికిన 7 మాటలు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” (లూకా 23:34).: ఈ వాక్యము ద్వారా మనుష్యుడు ఏమి చేయుచున్నాడు గ్రహింపు లేక చేయుచున్నాడు కనుక దేవుడు క్షమా అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు గనుక మనుషున్ని దేవుడు ప్రేమతో క్షమించుచున్నాడు అందుకనే తన తండ్రితో విజ్ఞాపన చేయుచున్నాడు తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగురు గనుక మీరు క్షమించమని దేవుడు మానవాళిని క్షమించి ప్రేమించాడు. “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” (లూకా 23:43). ఈ వాక్యము ద్వారా దేవుడు ఒక దొంగను రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు దొంగ తన యొక్క ప్రవర్తనను తన యొక్క స్థితిని ఎరిగి ప్రభువును ముందు చూసి అతడు పరలోక రాజ్యంలోనికి తను చేర్చుకోగలడని విశ్వసించి నమ్మకంతో దేవుడిని అడిగిన మాట నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దొంగ పశ్చాత్తాపము కలిగి దేవుని యందు విశ్వాసముంచి ఉన్నాడు గనుక దేవుడు రక్షణ అనే మాట ద్వారా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని వాగ్దానం చేశాడు. 3.”అమ్మా, ఇదిగో నీ కుమారుడు… ఇదిగో నీ తల్లి” (యోహాను 19:26-27). ఈ లోక సంబంధమును మరియు తల్లిదండ్రులను గౌరవించే స్వభావం కలిగినటువంటి ఏసుక్రీస్తు తన తల్లి అయిన మరియను ఆయన ఈ లోకంలో ఇంకా జీవించనని ఎరిగి తన బాధ్యతను తన శిష్యుడైన యోహానుకు అప్పగించి ఇహలోక సంబంధాన్ని కూడా గౌరవముగా బాధ్యతగా దేవుడు మానవుడు జీవించాలని సూచించాడు. “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ? (నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి?)” (మత్తయి 27:46). ఈ నాలుగో మాట ద్వారా ప్రభువైన యేసు తన తండ్రి అంతవరకు తనకు సహాయకుడిగా ఉన్నాడు అయితే మానవుని యొక్క పాపమును ఆ శిలువమానుపై క్రీస్తు భరించకపోతే మానవునికి పాపక్షమాపణ ప్రాయశ్చిత్తము లేదు అందుకని మానవుడు జన్మతః పాపమును మోయుచు వచ్చిన వాడికి విడుదల నిచ్చుటకు సిద్ధపడినటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసును విడిచెను. “నేను దప్పిగొనుచున్నాను” (యోహాను 19:28). ఈ ఐదో మాట ద్వారా కుమారుడైన యేసుకు ఈ లోకములో ఇంకును అనేక మంది రక్షణ లేక వారి యొక్క జీవితాన్ని పాపములోనే రక్షణ లేక ఉండి ఉన్నారని గ్రహించి అటువంటి మానవాళి రక్షణకు అనగా ఆత్మల రక్షణ నిమిత్తమై ఆయన దాహం కొనుచున్నానని శిలువ మీద పలికి ఉన్నాడు. “సమాప్తమైనది” (యోహాను 19:30). ఈ ఆరో మాట ద్వారా తను విజయం పొంది ఉన్నానని తండ్రి తనకు ఇచ్చినటువంటి ప్రతి ఈ లోక పనినంతటిని ఆయన గొప్ప విజయంతో ముగించి ఉన్నాడని సంకేతంతో ఇదిగో సమాప్తమైనదని పలికి ఉన్నాడు. 7.”తండ్రీ, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” (లూకా 23:46). మానవుని యొక్క జీవితము దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. మట్టిని తన స్వరూపమందు మానవునిగా నిర్మించి దేవుని యొక్క జీవ వాయువు ద్వారా మనిషికి ఊపిరిని అందించి నరుడు జీవాత్మగా సృష్టించబడ్డాడు అందుకని ఈ శరీరం మన్నే గనుక తిరిగి మట్టిలో కలిసిపోతుంది అదే రీతిగా ఆత్మ తండ్రి దయచేసి ఉన్నాడు గనుక తిరిగి మానవుని యొక్క ఆత్మ తండ్రి యొద్దకు చేర్చబడుతుంది కాబట్టి కుమారుడైనటువంటి యేసు ఆఖరిగా తన యొక్క బాధ్యతను తన ఆత్మను తిరిగి తండ్రి కాపు చెప్పుకున్నాడు అదే రీతిగా మానవుడు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తన యొక్క ఆత్మకు పరిరక్షణ కలిగించుకుంటూ తిరిగి తన ఆత్మను తండ్రి కావాలని విజ్ఞతతో దేవుడు ఈ మాట పలికి ఉన్నాడు సిలువ లో 7మాటలు పై విధంగా తెలియ జేశారు