గుడ్ ఫ్రైడే సందర్భంగా సి ఎస్ ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 4 యాడికి సిఎస్ఐ చర్చి నందు సిలువలో పలికిన ఏడు మాటలు సంఘానికి తెలియజేస్తూ యేసు మానవాళి రక్షణ కొరకు తన్ను తాను సిలువ యాగం ద్వారా తన ప్రాణాన్ని అర్పించాడని స్థానిక యాడికి సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ ఏ. జై రాజు గురువుల వారు తన సందేశాన్ని అందించారు అలాగే సంఘం అంతటికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు