గ్రామ పంచాయతీ సిబ్బందిపై మర్రిగూడ తహసీల్దార్ ఆగ్రహం.

పయనించే సూర్యుడు న్యూస్ మర్రిగూడ: ఏప్రిల్ 04. గ్రామ పంచాయతీ సిబ్బంది పై మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఆసరా కోసం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేటప్పుడే గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి పన్ను వసూలు చేయడం చట్టవిరుద్ధంగా నేరమని మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని శివన్నగూడ గ్రామపంచాయతీలో గురువారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో బాధితులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆసరా కోసం బాధితులకు ఇచ్చే పెన్షన్ డబ్బులు వారికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పంపిణీ చేస్తే ఇంటి పన్నులనే వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని దీనిపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇక నుంచి పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేటప్పుడు గాని మరుసటి రోజు గానీ ఇంటి పన్ను వసూలు చేయకూడదని అన్నారు. వసూలు చేసినట్టుగా ఏ ఒక్క బాధితుడు తమ దృష్టికి తీసుకు వచ్చిన అతనిపై కేసులు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. అక్కడే ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందిపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.