ఘనంగా బహిరంగ శిలువ యాత్ర

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 4 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న గుడ్ ఫ్రైడే సందర్భంగా మండల కేంద్రం అయిన పెనుగంచిప్రోలు లో పడమర బజారు ఆర్ సి యం చర్చి వద్ద నుండి బహిరంగ సిలువ యాత్ర క్రైస్తవ సోదరులు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ముచ్చింతాల విచారణ గురువు క్రీ స్తు రాజు పాధర్ ఆధ్వర్యంలో గుడ్ ప్రేడే సందర్భంగా తూర్పు బజారు ఆర్ సి యం చర్చి మీదుగా ముచ్చింతాల విచారణ ఆర్ సి యం చర్చి వరకు శుక్రవారం ఘనంగా బ హిరంగ శిలువ యాత్ర నిర్వహించారు. పట్టణంలోని ఆర్‌సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చర్చ్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శిలువ యాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి భక్తిమయ వాతావరణాన్ని సృష్టించింది. యేసుక్రీస్తు భూలోకంలో పాపుల రక్షణ కోసం అనుభవించిన శ్రమలు, ఆయన శిలువ మార్గం, మానవాళి విమోచన కోసం చేసిన మహాత్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు శిలువను మోస్తూ ప్రార్థనలు చేశారు. మార్గమధ్యంలో చర్చ్ పెద్దలు, ఆధ్యాత్మిక నాయకులు యేసుక్రీస్తు శిలువ వేయబడిన ఘటన, అనంతరం మూడవ రోజు పునరుత్థానమైన మహిమను ప్రసంగాల ద్వారా వివరించారు. భక్తులు పాటలు, స్తోత్ర గీతాలతో యాత్రలో పాల్గొని శాంతి, ప్రేమ, త్యాగ సందేశాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు నిర్వహించగా, ఈ దీక్షలు ఆదివారం ఈస్టర్ వేడుకలతో ముగియనున్నట్లు చర్చ్ నిర్వాహకులు తెలిపారు.ఈ యాత్ర లో ముచ్చింతాల విచారణ గురువు క్రీస్తు రాజు పాధర్ అన్ని గ్రామాల నుండి వచ్చిన ఉపదేశం మాస్టారు పెనుగంచిప్రోలు తూర్పు బజారు సంఘం నుండి మరియ దళ సభ్యులు, దీక్ష పరులు మరియు విచారణ లోని అన్ని సంఘా ల నుండి వచ్చిన విశ్వాసులందరు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *