చిన్న మాసన్ పల్లి ప్రాంతంలో రన్నింగ్ బస్ లోంచి దిగి వ్యక్తి అక్కడికక్కడే మృతి

దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి,యాకటి నర్సింలు."

పయనించే సూర్యుడు రాజేష్ ఏప్రిల్ 4 దౌల్తాబాద్) రాయపోల్ మండలం చిన్న మాసన్ పల్లి బస్టాప్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంతో సమాచారం అందుకున్న రాయపోల్ మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు వెంటనే వారి వివరాలు తెలుసుకొని వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు, పోలీసుల సమాచారం ప్రకారం దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన యాకటీ నర్సింలు తండ్రి పేరు రాజయ్య వయస్సు 40 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం, ఇతను బెజుగామ గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వెళ్లడానికి రామయం పేట నుండి గజ్వేల్ వైపు వెళ్లే బస్సు దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ దగ్గర అతను బస్సు ఎక్కడం జరిగింది కాగా చిన్నమాసన్ పల్లి స్టేజ్ దగ్గర దిగాల్సి ఉండగా కండక్టర్ చిన్న మాసన్ పల్లి స్టేజ్ దగ్గర దిగేవారు రావాలని అనగా వెంటనే లేచిన అతను బస్ ఆగిందా అని గమనించకుండా రన్నింగ్ బస్ లోంచి కిందకు దిగడం తో అక్కడికక్కడే తల పగిలి మృతి చెందడం జరిగింది.ప్రమాదానికి కారనమైన బస్సును పోలీసులు రాయపోల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు