దుద్దెడ గ్రామంలో ఏండీ న పంటను పరిశీలిచన గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ప్రతాఫ్ రెడ్డి

పట్టించికొని కాంగ్రెస్ ప్రభుత్వం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 4 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని కొండపాక మండల కేందమైన దుద్దెడ. గ్రామంలో శుక్రవారం రోజున గజ్వెల్ నియోజకవర్గంబి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటరు ప్రతాఫ్ రెడ్డి ఏండీ న పంటలను పరిశీలించి చారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎండిపోయిన వరి పంటలను పరిశీలించిన అసమర్ధత రేవంత్ రెడ్డి పాలన వలన కరెంటు సక్రమంగా లేక, ఎండుతున్న పంటలు అల్లాడుతున్న రైతులు కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో పుట్ట మల్లేశం రైతు మూడు ఎకరాలలో వరి వేసుకోగా రెండు ఎకరాలలో సక్రమంగా కరెంటు రాక వరి పంట పూర్తిగా ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. కెసిఆర్.ప్రభుత్వంలో నిమిషం పాటు కూడా కరెంటు పోలేదని, ఎరువులు విత్తనాలు ఇంటి వద్దకే వచ్చేవని, నాట్లు వేసే సమయంలోనే రైతుబంధు కేసీఆర్ వేశారని రైతులు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమర్థ పాలన రైతుల పట్ల శాపంగా మారిందని మండిపడ్డారు, రైతులకు కరెంటు సక్రమంగా రాక పంటలు ఎండిపోతున్న రేవంత్ రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదని తెలిపారు, రైతాంగానికి 12 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని, ఇచ్చిన కరెంట్ ఎప్పుడు వస్తది ఎప్పుడు పోతదో తెలియకుండా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలిపారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, లో వోల్టేజ్ కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, మోటర్లు కాలిపోవడం ఉండేటివి నేడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా కరెంటు లేక, ఎరువులు విత్తనాలు రాక, రైతుబంధు లేక, రేవంత్ రెడ్డి రైతులపై అక్కాసు వెలగకుతున్నారని, రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు, నాడు కెసిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కష్టాలను చూసి, రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి చావు నోట్లో తలపెట్టి ఉద్యమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టి కాలేశ్వరం, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్, లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలం చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తే నేడు రేవంత్ రెడ్డి రైతులను దివాలా తీయిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పంటలకు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన నిరంతరం కరెంటు ఇస్తే నేడు రాజ్యమేలుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలుతో 12 గంటల అరకొర కరెంటు ఇచ్చి రైతుల పంటలు ఎండ కొడుతున్నారని, రైతులను అప్పులపాలు చేస్తున్నారని, రైతుల ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి పాలనలో పెరిగాయని, రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు, అబద్దాల పునాదుల 420 అమలు కానీ హామీలతో, 6 గ్యారంటీలతో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని తెలిపారు, కాలేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లు వృధా అని చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు, కాలేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 3 లక్షల టన్నుల వరి ధాన్యం ఎట్లా పండిందని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నుండి తిమ్మాయిపల్లి వరకు టన్నెల్ మరియు కాల్వపనులను వెంటనే పూర్తి చేస్తే కొండపాక మండలం తో పాటు పక్క మండలాలు సస్యశ్యామలమవుతాయని రైతులు కరెంటుపై ఆధారపడరని తెలిపారు. వెంటనే కాలువలను టన్నెల్ ను పూర్తి చేసి సాగునీరు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరంపై కేసీఆర్ కుటుంబం పై రేవంత్ రెడ్డి కక్ష కట్టారని, సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాల రైతులపై రేవంత్ రెడ్డి కక్ష కట్టి పెండింగ్ లో ఉన్న కాలువలకు నిదురు మంజూరు చేయకుండా రైతులపై వెలగకుతున్నారని, రైతులు జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోకండి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతం కూడా తెలంగాణలో ఉందని ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే పెండింగ్లో ఉన్న కాలువల నిర్మాణం జరగాలని దానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇక్కడి రైతులపై వివక్ష సరికాదని ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నియోజకవర్గం లో రైతులకు 18 గంటల నిరంతర కరెంటు ఇస్తున్నారు కానీ కక్షతో గజ్వేల్ సిద్దిపేట్ దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి12 గంటల కరెంటు కూడా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకొని రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతుల హామీలను నెరవేరుస్తూ వారికి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటును అందించాలని, మల్లన్న సాగర్ కాలువలను , టన్నల్ పనులను పునరుద్ధరణ చేసి రైతులకు సాగునీరు అందించాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అనంతుల అశ్విని ప్రశాంత్, మాజీ ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్య, మండల ఫోరం అధ్యక్షుడు సంజీవరెడ్డి, దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, సర్పంచులు గాలి బాలయ్య, ముత్యాల ఎల్లం, తేలు అశోక్, బొమ్మ మల్లయ్య, కోడెల రవి, బాలస్వామి సినీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు దోమల ఎల్లం, పెద్దంకుల శ్రీనివాస్, పిల్లి నాగరాజు, గోన శ్రీనివాస్, రాజిరెడ్డి, జీరా రాజు, సురేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, గొట్టే ఐలయ్య, చిలుముల రామ్మోహన్, వెంకటేష్, కోడెల మల్లేశం, సున్నం భాస్కర్, దొమ్మాట మహిపాల్ రెడ్డి, పొద్దుల తిరుపతి, రాములు, అమ్ముల రమేష్, బీరయ్య, కనకయ్య, మైలారం శ్రీను, విష్ణు, రవి, బాల నరసయ్య, రమేష్, దున్న సాయిలు, యాదగిరి కిష్టయ్య టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులున్నారు