నిరుపయోగంగా నాన్ వెజ్ మార్కెట్ సముదాయం

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -04 రామగిరి మండలం సెంటనరీ కాలనీ లో మటన్, చికెన్, చాపల, షాపులను ఒకే కాడ ఏర్పాటు చేస్తామని కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 25 లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు కూడా దానిని ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది అన్నారు. నిరుపయోగంగా ఉన్న మటన్ చికెన్ సెంటర్ను చూసి సింగరేణి అధికారులపై కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ మార్కెట్ సముదాయం అసాంఘిక కార్యకారపాలకు అడ్డాగా మారిందని వెంటనే ఈ యొక్క చికెన్ మటన్ సెంటర్ ను ప్రారంభించక పోతే జిఎం ఆఫీస్ ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు.