పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ కారుకొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బిజినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిద్దె రాములు, గుడ్లనర్వ గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి నిరంజన్ రావు అతినారపు సంజీవ మిద్దె శ్రీను మరియు పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై ఈ వివాహ వేడుకను మరింత సందడిగా మార్చారు.