నేషనల్ ఛాంపియన్ ను అభినందించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ఇటీవల మంగళూరులో జరిగిన మహిళా పవర్ లిఫ్టింగ్ 69 కేజీల మహిళా విభాగం నందు 375కేజీలను ఎత్తి గోల్డ్ మెడల్ ను పలాస వాసి జరా సిద్విక్ సాధించారు. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమెను దుస్సాలువ కప్పి అభినందించారు. పలాస టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు క్రీడలలో మరింతగా రాణించాలని వారికి అవసరమైన ప్రోత్సాహకాలను సమకూరుస్తానని ఆమె తెలిపారు. క్రీడాకారిని భర్త హేమంత్ కిషోర్ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారని, భార్యను ప్రోత్సహించడం తో ఆమె జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా మెరిసారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ మరియు గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పి విటల్, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ కుత్తుమ లక్ష్మణ్ తెలుగుదేశం యువజన నాయకులు దువ్వాడసంతోష్ నాయుడు, ఇరిగేషన్ అధికారి పి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జి రామ్ మోహన్ రావు, ఏపీఎస్ఆర్టీసీ దాసరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *