పదోన్నతి పొందిన డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ లకు క్యాపింగ్ సేర్మని.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెడ్ నర్సులకు ఇచ్చిన పదోన్నతులలో గాంధీ ఆసుపత్రి నుండి సలెహ రహీం,సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నుండి వచ్చిన నాగవేణి లకు డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ పదోన్నతి పొందిన సందర్భంగా వారికి శుక్రవారం నాడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో క్యాపింగ్ సెర్మని నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, పేర్సీ సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.వారిని శాలువలు,పూలమాలతో ఘనంగా సత్కరించారు. నర్సింగ్ అధికారులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం శుభాదాయకమని నర్సింగ్ సూపర్ డెంట్ మంజుల అన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు పద్మ,సునీత, శ్వేత, నర్సింగ్ఆఫీసర్స్ ఎం.ఆనంద్, సరస్వతి, అనురాధ, పుష్పలత, కవిత, జ్యోతి, నిర్మల, నీలిమ, స్వప్న, అరుణ, జ్యోతి, రమా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *