పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 4 బోధన్ : బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో ఎల్లమ్మ జాతరను పురస్కరించుకొని కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు కుస్తీ పోటీలు వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు విడీసి మరియు పంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కుస్తీ పోటీలను ప్రారంభించారు. చివరి కుస్తీ గెలుపొందిన మల్లయోధుడికి 5 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఎల్లమ్మ మందిరం వద్ద జాతర ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మందిరం వద్దకు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో విడీసీ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
