పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 4:- రిపోర్టర్ (కే శివ కృష్ణ ) బాపట్ల రూరల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ నేరాలు నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని రూరల్ సిఐ ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక భద్రతా సూచనలు జారీ చేశారు. ఇటీవల కిలాడీ దొంగలు కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్నారని సిఐ హెచ్చరించారు. షాపుల్లో ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి, వాటర్ బాటిల్ లేదా ఇతర వస్తువుల పేరుతో మభ్యపెట్టి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. వస్తువు ఇచ్చే క్రమంలో వెనక్కి తిరిగినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల పట్ల అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. రూరల్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల సరఫరా లేదా సేవించడం వంటివి గమనిస్తే ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆకతకాయల వేధింపులు, వేగంగా వాహనాలు నడపడం వంటి పనులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సిఐ స్పష్టం చేశారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు ముందుగా పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. ఏప్రిల్ 16 నుండి హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదని, ఈ నిబంధన ఉల్లంఘించే బంకు యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సమయం వృధా చేయకుండా కింది నంబర్లకు ఫోన్ చేయాలని సిఐ కోరారు. అత్యవసర సహాయం: 112, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్: 9154880710, రూరల్ సిఐ (ప్రభాకర్): 9440796258 రూరల్ ఎస్ ఐ: 8978777808, మీ భద్రత మా బాధ్యత. ఏదైనా ప్రమాదం లేదా అఘాయిత్యం జరిగిన వెంటనే మాకు తెలియజేస్తే తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేర రహిత సమాజ స్థాపనలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. బాపట్ల రూరల్ సీఐ ప్రభాకర్