పయనించే సూర్యుడు-04-04-2026-రాజంపేట న్యూస్ : ప్రజల అభీష్టం మేరకే అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగిందని జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు పేర్కొన్నారు. శుక్రవారం యల్లటూరు భవన్ నందు అమరావతి విజయోత్సవ సభ నిర్వహించి అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్విత రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ లోక్ సభ తీర్మానించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలిచే ఈ రాజధాని బిల్లుతో సుమారు 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు చట్టబద్ధత లభించిందని తెలిపారు. ఈ మహత్తర నిర్ణయానికి దేశవ్యాప్తంగా లభించిన మద్దతు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అచంచల సంకల్పం వల్లే అమరావతి కల సహకారం అయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండెం అబూబకర్, రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ యమ్.రమణయ్య, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు, బిజెపి నాయకులు తోట ధీరజ్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మావిళ్ళ రవి, పెడకాల సుధాకర్, మౌల, పిచ్చయ్య నాయుడు, బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ, బిజెపి నాయకులు ధనాసి వెంకటరమణ, గిరీష్, నాగేశ్వరరావు, చిన్నయ్య, బీదమ్, నాగేంద్ర, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.