ప్రమాద సూచికల ఏర్పాటు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. నర్మెట సిఐ ఎం అబ్బయ్య ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామంలోని చెరువు వద్ద బచ్చన్నపేట ఎస్ హెచ్ ఓ ఎస్ కే హమీద్ తో కలిసి ప్రమాద హెచ్చరికల సూచికలను ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ చెరువు లోతైనదని విద్యార్థులు యువకులు చిన్న పిల్లలు తెలియకుండా దిగి ప్రమాదాల బారిన పడవద్దు అని ఇందులో ఈతలు కొట్టడం నిషేధమని ప్రమాద సూచికలు పెట్టామని, వీటిని విధిగా అనుసరించాలని తెలిపారు. కార్యక్రమంలో అంబాల ఆగయ్య గౌడ్, బడుకోల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ రామన్న, విజయ్ కాంత్ గ్రామంలోని యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *