పయనించే సూర్యుడు) 03/04/26 వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండల్ రిపోర్టర్ హన్మంతు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుండి వసూళ్లు చేసుకోని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్ధులకు చెల్లించాలని తీర్పు సరైనది కాదని ఇది విద్యార్థుల చదువుల అభివృద్ధికి గొడలిపెట్టని హైకోర్టు తీర్పును పునఃసమీక్ష చేయాలని ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని అలాంటిది ప్రైవేటు యాజమాన్యాల బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్ధుల నుండి వసూళ్లు చేసుకోండి. అనే తీర్పు సరైనది కాదు అన్నారు. అణాగారిన వర్గాలు నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న ప్రధానంగా ఈ ఫీజులు పోందే వారు పేద విద్యార్థులు వారిలో రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బి.సి. ,మైనారిటీ విద్యార్ధులలే ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారని వారికి ఈ తీర్పు వల్లన మరింత వేధింపులకు గురి అవుతారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు బకాయిలు రావడం లేదని పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, దీని వల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ కమిటీ సభ్యుడు ఆకాష్ పాల్గొన్నారు.