బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి కప్పు పెచ్చులుడి గాయాల పాలై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్ ఎఫ్ ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంజయ్ శశిధర్ మాట్లాడుతూ పట్టణంలో హనుమాన్ నగర్ లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలన్నారు తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి తలపైన పడడంతో తీవ్ర గాయలు అయ్యాయన్నారు గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పాఠశాల యాజమాన్యానికి డిమాండ్ చేశారు ప్రధానంగా గుడ్ ఫ్రైడే పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు ఉంది కానీ శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం మాత్రం పాఠశాలకు సెలవు ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా పాఠశాలను నడుపుతున్న యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు నిద్ర మేలుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *