బిఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నాయకుల భారీ చేరిక

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): జహీరాబాద్ మండలంలోని మధులై తాండా గ్రామ పంచాయతీకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఆధ్వర్యంలో మధులై తాండా ఉప సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ తో పాటు నాయకులు జై సింగ్, రవి, ఏక్ నాథ్, సంతోష్, కృష్ణ, జైపాల్, ధనరాజ్, నాగేందర్, రాజు, పృథ్వీ, వెంకట్, మనోజ్ మరియు వారి బృందం (40 మంది) బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వంలో తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి, సాగు తాగు నీరు అందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. అమలు గాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరూ రాథోడ్, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్, మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, నాయకులు చిన్న రెడ్డి, జగదీశ్, పర్వేజ్ పటేల్, రాజు, గులాబ్ సింగ్, సీనియర్ నాయకులు పుండ్లీక్ పవార్, దేవిదాస్, పవన్ రాథోడ్, మేఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *