బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ను తెచ్చిన ఘనత కోమటిరెడ్డి బ్రదర్స్ దే : డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి

★ 10 యేండ్లు అధికారంలో ఉండి కూడా ఒక పైసా నిధులు ఇవ్వని నీచులు మీరు . ★ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కోమటిరెడ్డి బ్రదర్స్ దే . ★ రాజ్ గోపాల్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తొక్కి నారతీస్తాం . ★ సీఎంఆర్ఎఫ్ క్కుల పంపిణీలో డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఏప్రిల్ : 04. మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో టిఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగే కొంతమంది చెంచా గాళ్లు సోషల్ మీడియాలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని.. రాజగోపాల్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు అవాకులు చవాకులు పేలితే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి…నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ని బ్రతిమాలి తమ ప్రాంతానికి సాగు మీరు అందించాలని దీర్ఘ దృష్టితో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును తీసుకొచ్చిన ఘనత కోమటిరెడ్డి బ్రదర్స్ దే అని గుర్తు చేశారు.. పది సంవత్సరాలు అధికారం వెలగబెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకుండా తమ నీచపు బుద్ధిని చాటుకుందని… ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి పూర్తి చేసారన్నారు… బ్రాహ్మణ వెల్లల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని గ్రామాలకు నీటిని తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాజగోపాల్ రెడ్డి పైన అబద్ధపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు… గత వేసవిలో తన సొంత నిధులతో కాలువలు తవ్వించి పులిపలుపుల చెరువులోకి నీటిని తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి దే నన్నారు… మునుగోడు నియోజకవర్గంలో కమిషన్ల కోసం రిజర్వాయర్ల కట్టలు కట్టి వదిలేసి పోతే ఆ రిజర్వాయర్లకు ఎదుల నుండి నీటిని తీసుకొచ్చే విధంగా 1800 కోట్ల రూపాయల నిధులు మంజురు చేయించారని గుర్తు చేశారు… తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో పేదలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మునుగోడు మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు మండల నాయకులతో కలిసి మునుగోడు లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు 165 మంది లబ్దిదారులకు 48,37,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధుల చెక్కులు గాని, కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు గాని ఎంతో పారదర్శకత్వం తో పార్టీలకతీతంగా అందిస్తున్న గొప్ప మానవతావాది అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఅని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , లబ్ధిదారులు పాల్గొన్నారు.