మృతిరాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.

దాత వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని కట్కూరు గ్రామంలో జంగం రాజమ్మ మరణ వార్త తెలుసుకున్న వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ దశదిన కార్యక్రమానికై 5000 రూపాయలు కుటుంబ సభ్యులకి ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆముదాల భూపాల్ రెడ్డి ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీకాంత్ వార్డ్ మెంబర్లు చింతల భాస్కర్, గుడుగుల సతీష్, గడిపే ప్రమోద్, నిడిగొండ శ్రీమణి చంద్ర, తమ్మడు ఆంజనేయులు శ్రీరాముల శ్రీధర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *