యుద్ధం వద్దు – మానవత్వం ముద్దు

సైకత శిల్పంతో 'అనపర్తి' కళాకారుడి విశ్వసందేశం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, అమాయక ప్రజల ఆర్తనాదాల నేపథ్యంలో శాంతి ఆశావహ దృక్పథాన్ని చాటుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి తన సృజనాత్మకతను చాటుకున్నారు. అనపర్తి నియోజకవర్గానికి చెందిన ఖ్యాతి గడించిన సైకత శిల్పి శ్రీనివాస్, రంగంపేటలో శుక్రవారం యుద్ధ వ్యతిరేకతను ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన ఇసుక శిల్పాన్ని తీర్చిదిద్దారు.కలచివేస్తున్న యుద్ధ దృశ్యాలుప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, పసిపిల్లలు అనాథలుగా మారుతుండటంపై శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “యుద్ధాన్ని ఆపండి – అమాయకుల ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో ఆయన రూపొందించిన శిల్పం చూపరులను కదిలిస్తోంది. యుద్ధం వల్ల విజేతలు ఎవరూ ఉండరని, కేవలం కన్నీళ్లు, విధ్వంసం, శ్మశానాలే మిగులుతాయని ఈ కళాకృతి ద్వారా ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు.శాంతి మార్గమే శరణ్యంఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. “ప్రపంచ దేశాల నాయకులు తమ విభేదాలను పక్కన పెట్టి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. యుద్ధం వల్ల కలిగే నష్టం తరతరాల వరకు వెంటాడుతుంది. విధ్వంసానికి బదులు అభివృద్ధిని, ద్వేషానికి బదులు మానవత్వాన్ని ఎంచుకోవడమే నేటి ప్రపంచానికి అత్యంత అవసరం” అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *