పయనించే సూర్యడు ఏప్రిల్ 04 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నడిగూడెం గ్రామానికి చెందిన నక్క గోవిందు-స్వరూప దంపతుల కుమారుడు సందీప్, వధువు విన్యశ్రీల వివాహ వేడుక శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వేదికపై వధూవరులను కలిసిన మల్లయ్య యాదవ్ , వారికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వధూవరులు నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నక్క గోవిందు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి, వివాహ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకకు మండలంలోని పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు భారీగా తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు.