పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 4 సాలూర :వర్షం ఒక కుటుంబానికి కేవలం కాలం మార్పు కాదు జీవితం మారిపోయే విపత్తుగా మారింది. సాలూర మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో నివసించే ఒక నిరుపేద కుటుంబం ప్రస్తుతం నిలువనీడ లేక రోడ్డున పడింది ఈ కార్యక్రమంలో మొనేగారి రాజు మాట్లాడుతూ గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వారి మట్టి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆ కుటుంబం నివాసం కోల్పోయి, చెట్టు నీడలోనే కాలం గడుపుతోంది సాలూర గ్రామానికి చెందిన చాకలి జయ జీవన పోరాటం మరింత విషాదకరం. బట్టలు ఉతుకుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెకు భర్త మానసిక సమస్యలతో బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో ముగ్గురు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లిని పోషించే బాధ్యత అంతా జయ భుజాలపై పడింది ఎండలో మండుతూ వానలో తడుస్తూ… కనీస ఆశ్రయం లేకుండా జీవిస్తున్న ఈ కుటుంబ పరిస్థితి గ్రామస్తుల హృదయాలను కలచివేస్తోంది సహాయం కోసం విజ్ఞప్తి ఈ దయనీయ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు వెంటనే స్పందించి కనీసం తాత్కాలికంగా ఒక రేకుల షెడ్డు నిర్మించేందుకు సహాయం చేయాలని కోరుతున్నారు.అలాగే గ్రామ ప్రజలు మరియు దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయం అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాల్సిన సమయం ఇది ఒక చిన్న సహాయం ఒక కుటుంబానికి పెద్ద ఆశ్రయం కావచ్చు.