విలాసాగర్ గ్రామంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన

విలసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామంలో సర్పంచ్ ఏనుగుల కనకయ్య మరియు శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంఘం నాయకులు ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని సంకల్పించారు, ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ పలువురు నాయకులు ప్రసంగాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కురుమ సంఘం యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *