పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ జేష్ఠ మాత సమేత శనేశ్వర స్వామి పునః ప్రతిష్టించి నేటికీ 26 సంవత్సరాలు పూర్తయినట్లు శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు.శ్రీశనీశ్వర దేవాలయ 26వ బ్రహ్మోత్సవాల ముగింపు గురువారం 3వ రోజు కార్యక్రమంలో మండల ఎస్.ఐ. శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వ్రతాన్ని వేదమూర్తులైన వేద అర్చక బృందం ప్రత్యేకంగా నిర్వహించారు. ఉమామహేశ్వర వ్రత నిర్వహణతో ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు, పాడిపంటల సమృద్ధి,ప్రకృతి అకాల నివారణ, అభిష్టాలు నెరవేరుట, అష్ట ఐశ్వర్య ప్రాప్తి కొరకు ఉమామహేశ్వర స్వామి కటాక్షం తప్పనిసరి అన్నారు. ఉమామహేశ్వరులకు, బ్రాహ్మ సూత్రము గల పరమశివునికి, వినాయక స్వామికి పంచామృత పలాస విశేష ద్రవ్య అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా రుద్ర హోమం, దుర్గా హోమం, శాంతి హోమం కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీనివాసులు నిరోషా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూర్ణాహుతి చేశారు.వడ్డేమాన్ గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బండ్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదల పంపిణీ తో పాటు అన్నప్రసాద పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాలరావు, ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రి, సర్పంచ్ సుగుణమ్మ,ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర చారి, అడ్వకేట్ వీర శేఖరా చారి, పుల్లయ్య,శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధంశెట్టి నరేష్ శెట్టి, కేంచే రాజేష్, యాదయ్య, అర్చకులు ఉమామహేశ్వర్,శాంతి కుమార్, సాయిసృజన్, మల్లికర్జున్, హరికేశ్వర్, మధు శంకర్, వినయ్ భూషణ్, అభిరామ్, సుందరేశ్వర్, వివిధ ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.