పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 యడ్లపాడు మండల ప్రతినిధి.. మాజీ మంత్రివర్యులు విడదల రజిని వారి నివాసంలో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యడ్లపాడు మండలానికి చెందిన నాయకులు యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, రాచమంటి చింతరావు, షేక్ రసూల్ తదితరులు అంబటి రాంబాబు కలిసి పార్టీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీలో అంబటి రాంబాబు పార్టీ దిశా దశపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. కార్యకర్తలే పార్టీకి మూలస్తంభమని పేర్కొంటూ, ప్రతి నాయకుడు ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే రాబోయే రోజుల్లో వైసీపీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపబడిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.