శివదేవాలయం కు భూమిపూజ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ గుర్రాల చెరువు గ్రామంలో శ్రీ శ్రీ త్రిపురాంబ సమేత కుండలేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన అంగరంగ వైభవంగా జరిగింది ఈ దేవాలయానికి స్థలదాత సంకురాత్రి సతీష్ దంపతులు చేతులు మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేసారు ఈ దేవాలయాన్ని గుర్రాలచెరువు అశ్వారావుపేట , శివ భక్తులు, వ్యాపారస్తులు కలిసి గుడిని ప్రతిష్టంకంగా నిర్మించడానికి కృషి చేస్తున్నారు ఈ గుడి ప్రత్యేకతలు గుడిలో వున్నా ప్రధాన శివలింగానికి పురుషులు లతో పాటు మహిళలు, పిల్లలు కూడా లో అభిషేకం చేయవచ్చని తెలిపారు. ఈ దేవాలయం నిర్మాణం, శంకుస్థాపన వాస్తు పండిట్ మేడూరి సాంబ శివ ప్రసాద్ శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో నడుస్తుందిని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరభద్రరావు సుంకవల్లి. కొక్కెరపాటి పుల్లయ్య. వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జల్లిపల్లి దేవరాజు తుమ్మ రాంబాబు. కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి డాక్టర్ ప్రసాద్. కంచర్ల భాస్కర్ రావు. ముక్కు శ్రీను. ఉప్పల పవన్. సంక రవి. ఆళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు