సూర్యుని కిరణాలు గర్భాలయంలోని అమ్మవారి మూలవిరాట్ను నేరుగా తాకాయి.చైత్రమాసం పాడ్యమి

* అమ్మవారి మూలవిరాట్ను తాకిన సూర్యకిరణాలు... * శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం,

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 4 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున అమ్మవారి మూలవిరాట్ను తాకిన సూర్యకిరణాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలులో వెలసిన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నేడు ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుని కిరణాలు గర్భాలయంలోని అమ్మవారి మూలవిరాట్ను నేరుగా తాకాయి. చైత్రమాసం పాడ్యమి రోజున శ్రీ చక్ర పూజ సమయంలో సుమారు ఉదయం 6:30 నుండి 6:45 నిమిషాల మధ్యలో సూర్యకిరణాలు అమ్మవారిని తాకినాయు శ్రీ అమ్మవారి పాదాల నుంచి ముఖారవిందం వరకు అమ్మవారిని దివ్య తేజస్సుతో వెలిగించిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. ఇది అత్యంత శుభసూచకమని, ఆలయానికి విశేషమైన శక్తిని ఇస్తుందని పూజారులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కావడంతోటి రెండు తెలుగు రాష్ట్రాలలోని అమ్మవారి భక్తులు వాళ్ళ పొంగళ్ళు తీసుకొని అమ్మవారి దర్శనంకు తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిమెంట్ రోడ్డుపై దేవస్థానం వారు నీటితో తడుపుతూ కాళ్లు కాలకుండా కాయర్ మ్యాట్స్ ఏర్పాటు చేసినారు క్యూ లైన్ నందు మంచినీటి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *