తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు గజ్వేల్ శాసనసభ్యులు అధికార నివాస గృహం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాంసిద్ధం వేణుమాజీ వైస్ చైర్మన్జిల్లా ప్రజా పరిషత్.

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /05: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల బి ఆర్ ఎస్. జిల్లా మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాజీ వైస్ చైర్మన్ జిల్లా ప్రజా పరిషత్. గజ్వేల్‌లో బి ఆర్ ఎస్ అధినేత మరియు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్, క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఆద్దాలు , ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు గోడలపై బలవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేయడం. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారం, అసహనం, రాజకీయ దివాళాను స్పష్టంగా చూపిస్తోంది. ఖ్యాతనపల్లి , ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ విజయాన్ని, జీర్ణించుకోలేక ఈ రకమైన నీచ రాజకీయాలకు దిగడం అత్యంత ఖండనీయం. రేవంత్ రెడ్డి, ఎవరు? ఆయన ఫోటోను బలవంతంగా ప్రతి గోడపై పెట్టేంత గొప్ప వ్యక్తిత్వమా? ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రభుత్వ నివాసాల్లో నరేంద్ర మోదీ ఫోటోలు పెట్టినారా ? క్యాంప్ కార్యాలయాలు ప్రజాప్రతినిధుల నివాసాలే తప్ప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాల్సిన ఎలాంటి నిబంధన లేదు; ఎం ఎల్ ఎం, బీజేపీ మరియు కేంద్ర మంత్రులకు కేటాయించిన కార్యాలలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారా ? ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన రాజకీయ దౌర్జన్యం. ఇలాంటి దుండగ చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే బి ఆర్ ఎస్, పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతుందని హెచ్చరిస్తున్నాము. బి ఆర్ ఎస్ , కార్యకర్తలు ఆగ్రహంతో వెళ్లి అక్కడ పెట్టిన రేవంత్ రెడ్డి ఫోటోకు పువ్వుల దండలు వేసి నిరసన చేస్తే ఆ పరిస్థితిని కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచించండి ! ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలి గానీ గోడలపై బలవంతంగా ఫోటోలు కాదు .ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల దృష్టిలో మరింత దిగజారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *