పయనించే సూర్యడు ప్రతినిధి ఏప్రిల్.05. 2026 వేసవి కాలం కావడంతో పశువులకు మేత లేక ఇబ్బందులు పడుతున్న 2000 వేల పశువులు. పులి భయంతో పనులు లేకుండా ఉన్న కూలీలకు రోజు వారి వేతనాలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి.పశువులకు గడ్డి గ్రాసం, దాన, త్రాగునీరు పశువుల పెంపకం దారులకు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయాలి. ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ పోలవరంజిల్లా, రంపచోడ వరం నియోజకవర్గం, దేవీపట్నం మండల పరిధిలోని పూడిపల్లి, శరభవరం, ఇందుకూరుపేట, దేవారం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న రామదుర్గం కొండలలో పెద్దపులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు జియో ట్రాకింగ్ ద్వారా నిర్ధారించి ప్రజలకు అప్రమత్తత చేస్తు పెద్దపులి పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రతిరోజు జీడి మామిడి తోటలోకి ప్రజలు జీడి పిక్కలు, మామిడి కాయలు సేకరించడానికి తోటల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. అలాగే వేసవి కాలం కావడంతో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పశువులు కలిగిన రైతులు పశువులకు మేపులు లేక పశువులు త్రాగేందుకు నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఫారెస్ట్ అధికారులు పెద్దపులి పేరు చెప్పి భయాందోళనకు గురి చేస్తున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెద్దపులిని బంధించి “జూ”కి తీసుకెళ్లాలని లేనిపక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారి కూలి పనులు కోల్పోతున్న సుమారు 6000 మంది ప్రజలందరికీ తక్షణమే కూలి వేతనాలు చెల్లించాలి. అలాగే వేసవి కాలం కావడంతో పశువులకు పశుగ్రాసం, దాన మరియు తాగునీరు తక్షణమే ఉచితంగా అందించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రోజువారి కూలీలు మరియు పశువుల పెంపకం దారులతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చోడి శ్రీను వాసు దొర, తెల్లం నూకన్న దొర, సత్తి శ్రీను వాసు రెడ్డి, తెల్లం వెంకన్న దొర మొదలైన వారు పాల్గొన్నారు.